అక్రమ వలసదారులకు అమెరికా బిగ్ షాక్.. పట్టుబడ్డారంటే రూ.4.49లక్షలు చెల్లించాల్సిందే!

అమెరికాలో అక్రమంగా ప్రవేశించే వలసదారులకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఇకపై చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటిన 14 ఏళ్లు పైబడిన వ్యక్తులపై 5,000 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.4.49 లక్షలు) పట్టుబడినందుకు రుసుము వసూలు చేయడం ప్రారంభించారు. కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా అరెస్టు చేసిన వెంటనే ఈ జరిమానా వర్తిస్తుంది. దీనిని చెల్లించడంలో విఫలం అయితే.. ఆ మొత్తం అమెరికా ప్రభుత్వానికి అధికారిక అప్పుగా మారి, భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు అందకుండా పోతాయని DHS (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ) స్పష్టం చేసింది.