ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం క్రూరత్వమే.. ఈ కారణంతో విడాకులు తీసుకోవచ్చు: హైకోర్టు సంచలనం

వైవాహిక బంధంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, మతం మారమని ఒత్తిడి చేయడం తీవ్రమైన మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. భార్య ఆత్మహత్య బెదిరింపులు, కిరోసిన్ పోసి నిప్పంటించుకునే ప్రయత్నాలు, ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేసిన నేపథ్యంలో.. భర్తకు విడాకులు మంజూరు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. క్రూరత్వం కేవలం భౌతిక హింసకు మాత్రమే పరిమితం కాదని.. భాగస్వామిలో భయాన్ని కలిగించే ప్రవర్తన కూడా హింసేనని జస్టిస్ రజనీ దుబే, జస్టిస్ అమితేంద్ర కిషోర్ ప్రసాద్‌లతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది.