కృష్ణుడిని పెళ్లి చేసుకున్న యువతి.. అనూహ్య సంఘటనతో నిర్ణయం, ఊరేగింపుగా వచ్చిన పెళ్లికొడుకు

శ్రీకృష్ణుడికి తన జీవితాన్ని అంకితం చేసి.. ఉత్తర్‌ప్రదేశ్‌ యువతి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుంది. పెళ్లి కుమారుడిగా కృష్ణుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకురాగా.. ఆమె కుటుంబం, గ్రామస్తులు సాధారణ పెళ్లిలాగే అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించారు. ఆ కృష్ణుడి విగ్రహంతో దండలు మార్చుకుని.. ఆ యువతి ఏడు అడుగులు వేసింది. ఇక ఈ వినూత్నమైన పెళ్లికి.. బంధువులు, కుటుంబ సభ్యులు భారీగా హాజరయ్యారు.