నా తండ్రే ఐదేళ్లూ సీఎంగా ఉంటారు అన్న సిద్ధరామయ్య కొడుకు: మంచి జరగాలని కోరుకుందాం అన్న డీకేఎస్

కర్ణాటక ముఖ్యమంత్రి పదవీ కాలంపై నెలకొన్న రాజకీయ ఉత్కంఠ మళ్లీ పతాక స్థాయికి చేరింది. సీఎం సిద్ధరామయ్య కుమారుడు, మాజీ ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేస్తూ.. తన తండ్రి ఐదేళ్ల పూర్తి పదవీకాలం సీఎంగా కొనసాగుతారని బల్లగుద్ది చెప్పారు. నాయకత్వ మార్పుపై గందరగోళం తలెత్తడానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం పదవిని ఆకాంక్షించడమే కారణమని ఆయన పరోక్షంగా ఆరోపించారు. దీనికి డీకే శివకుమార్ స్పందిస్తూ.. నేను సంతోషంగా ఉన్నాను. రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుందాం అంటూ అర్థగర్భితమైన వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్‌లో పవర్ షేరింగ్ వివాదం మరింత వేడెక్కింది.