పుతిన్ రెడీ, జెలెన్‌స్కీయే సిద్ధంగా లేరు: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ట్రంప్ సంచలనం

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించేందుకు తాను ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరపు నుంచి ఆమోదం లభించిందని, అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ మాత్రం ఇంకా సిద్ధంగా లేరని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాలని, నాటోలో చేరకూడదనే కీలక షరతులు ఉన్న 28 అంశాల ముసాయిదా ప్రతిపాదనకు రష్యా అంగీకరించింది. అయితే జెలెన్‌స్కీ ఈ ప్రతిపాదనను ఇంకా చదవకపోవడం నిరాశ కలిగించిందని ట్రంప్ పేర్కొన్నారు.