యుద్ధం చేయాలని లేదు, బలవంతంగా లాక్కొచ్చారు: రష్యా తరపున పోరాడి ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డ భారతీయుడు

గుజరాత్‌లోని మోర్బీకి చెందిన 22 ఏళ్ల మజోటి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్‌ను తాజాగా ఉక్రెయిన్ దళాలు అరెస్టు చేశాయి. భారత దేశానికి చెందిన ఈ యువకుడు రష్యా సైన్యం తరఫున విధులు నిర్వహిస్తుండగా.. ఉక్రెయిన్ బలగాలకు పట్టుబడినట్లు ఆ దేశ మీడియా ఆరోపించింది. అయితే హుస్సేన్ అరెస్టుపై భారత అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ నివేదికలను పరిశీలించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హుస్సేన్ కూడా.. రష్యానే బలవంతంగా తనను యుద్ధభూమిలోకి దింపిందని ఆరోపిస్తున్నాడు.