రూ.10,400 కోట్లతో.. ఆ నేషనల్ హైవే 8 లైన్లుగా విస్తరణ.. దూసుకెళ్లేందుకు బీ రెడీ..

తెలంగాణలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కీలకమైన హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవే (NH-65) ను 8 లైన్ల రహదారిగా విస్తరించాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 10,400 కోట్లుగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి డీపీఆర్ తయారీ జరుగుతోంది. డీపీఆర్ ఖరారైన తర్వాత నిధులు మంజూరై.. నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. ఈ విస్తరణతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం తగ్గి, ట్రాఫిక్ రద్దీ సమస్య తీరుతుందని.. వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.