లక్షల విలువైన వజ్రాల గుడ్డు లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఎలా బయటకు తీశారంటే?

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఓ దొంగతనం కేసులో చోటుచేసుకున్న అనూహ్య ఘటన పోలీసులనే ఆశ్చర్య పరిచింది. లక్షల విలువ చేసే వజ్రాలు పొదిగిన గుడ్డు ఆకారంలోని లాకెట్‌ను అపహరించిన ఓ 32 ఏళ్ల వ్యక్తి.. దొంగిలించిన ఆభరణాన్ని దాచిపెట్టేందుకు ఏకంగా మింగేసినట్లు ప్యాట్రిడ్జ్ జ్యువెలర్స్ యజమాని ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేసి.. పలు వైద్య పరీక్షల అనంతరం సహజ పద్ధతి ద్వారా ఆ లాకెట్‌ను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ లాకెట్‌లో 60 తెల్ల వజ్రాలు, 15 నీలమణులు, 18 క్యారెట్ల చిన్న బంగారు ఆక్టోపస్ బొమ్మ ఉన్నట్లు దుకాణ యజమాని తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆ నిందితుడిని డిసెంబర్ 8న కోర్టులో హాజరుపరచనున్నారు.