వందేమాతరం యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చింది: లోక్‌సభలో ప్రధాని మోదీ

లోక్‌సభలో వందేమాతరంపై జరుగుతున్న చారిత్రక చర్చను ప్రారంభిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం పూర్తి చేసిన చారిత్రక ఘట్టాలను గుర్తుచేస్తూ.. వందేమాతరం 50 ఏళ్లు నిండినప్పుడు దేశం వలస పాలన కింద ఉంది. దానికి 100 ఏళ్లు నిండినప్పుడు దేశం ఎమర్జెన్సీ చీకటి కాలంలో ఉంది అని ప్రధాని అన్నారు. లక్షలాది మంది ఈ గీతాన్ని ఆలపించి పోరాడడం వల్లే నేడు మనం పార్లమెంట్‌లో కూర్చోగలిగామని తెలిపారు. ఈ పవిత్ర గీతం కేవలం రాజకీయ స్వేచ్ఛా మంత్రం మాత్రమే కాదని.. బానిసత్వం నుంచి మాతృభూమిని విముక్తం చేసేందుకు జరిగిన పవిత్ర యుద్ధం అని ఆయన స్పష్టం చేశారు.