సోనియా గాంధీకి కోర్టు నోటీసులు.. ఏ కేసులో అంటే?

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి సంబంధించి న్యాయపరమైన వివాదం తిరిగి తెరపైకి వచ్చింది. భారత పౌరసత్వం పొందే కంటే ముందే (1983కి ముందు) ఆమె పేరును ఓటరు జాబితాలో చేర్చారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన రౌజ్ అవెన్యూలోని సెషన్స్ కోర్టు.. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని కోరుతూ సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. గతంలో మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించగా.. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సెషన్స్ కోర్టులో దాఖలైన రివిజన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ నోటీసులు జారీ అయ్యాయి.