గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మంగళవారం మండలంలోని కందివలస, కంబవలసల్లో 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లు వల్ల ప్రజల స్థితిగతులు మారుతాయన్నారు. కందివలసలో శ్మశానానికి దారిలేకపోవడంతో ప్రస్తుతం నిర్మించిన సీసీ రోడ్డు వల్ల పొలాలు, శ్మశానానికి వెళ్లేందుకు ఉపయో గపడుతుందన్నారు.