డిప్యూటీ సీఎం భట్టి మీద కొంచెం గౌరవం ఉండేది.. ఆ మాటలు విన్నాక పూర్తిగా పోయింది: కవిత

సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలపై విచారణ జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. హైదరాబాద్‌లో జరిగిన సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె.. రాజస్థాన్ సోలార్ ఒప్పందం, లిథియం రిఫైనరీ డీల్స్‌లో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ. 47 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే సింగరేణిని కాపాడుకోవడానికి మరో ఉద్యమానికి సిద్ధమని ప్రకటించారు.