లక్నో - ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు.. టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే!

లక్నో విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరాల్సిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. 6E2111 అనే ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టాయిలెట్ టిష్యూ పేపర్‌పై ఎవరో చేతితో రాసిన నోట్ కనిపించింది. ఆ నోట్‌లో విమానంలో బాంబు ఉన్నట్లు రాశారు. దాంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది.. భద్రతా అధికారులకు సమాచారం అందించారు. భద్రతా తనిఖీల అనంతరం అది కేవలం బెదిరింపు అని మాత్రమే అధికారులు తేల్చారు. ఆ నోట్ రాసిన వ్యక్తి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.