Tamil Nadu: స్టాలిన్ భిక్షతో గెలిచి.. విజయ్ పంచన చేరుతారా? కాంగ్రెస్‌పై డీఎంకే ఘాటు విమర్శలు

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో రాష్ట్రంలో కొత్త రాజకీయ శకం మొదలైంది. అయితే, మెజారిటీకి అవసరమైన 118 స్థానాలకు మరో 10 సీట్ల దూరంలో విజయ్ నిలిచిపోవడంతో.. కింగ్ మేకర్‌గా మారిన కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు డీఎంకేతో ఉన్న దశాబ్దాల బంధాన్ని తెంచుకుని, విజయ్ వైపు మొగ్గు చూపడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై డీఎంకే నిప్పులు చెరుగుతోంది. కాంగ్రెస్ నేతలను ఏకంగా వెన్నుపోటుదారులు (Backstabbers) అని సంబోధిస్తూ డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నదురై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఉన్న 5 అసెంబ్లీ సీట్లు కేవలం ఎం.కె. స్టాలిన్ భిక్షేనని ఘాటుగా విమర్శించారు. గతంలో రాహుల్ గాంధీని బీజేపీ 'పప్పు' అని ట్రోల్ చేస్తున్నప్పుడు, ఆయనే తదుపరి ప్రధాని అని మొదటగా ప్రకటించి గౌరవించింది స్టాలినేనని గుర్తు చేశారు.