కాకిలా తిరుగుతున్న జగన్ కాపుల పాలిట నమ్మకద్రోహి... తిరుపతి లడ్డూ కల్తీలో శిక్ష తప్పదు: మంత్రి సవిత వార్నింగ్

మహాప్రసాదం వెంకన్న లడ్డూలో పాలుతో చేసిన నెయ్యి కాకుండా, కల్తీ నెయ్యి కలిసిందనే విషయం బట్టబయలవ్వడంతో వైసీపీలో వణుకు ప్రారంభమైందని, ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి బూతులు తిడుతూ డైవర్షన్ రాజకీయాలకు తెర తీశారని జగన్ పైనా, ఆ పార్టీ నాయకులపైనా రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. కాకిలాగా ఊరూరూ తిరుగుతూ, కాపులను మభ్యబెట్టి, వారి ఓట్లను దండుకుని నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు మీద తప్పులు చేసి, కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కులాల కార్డులు ఉపయోగిస్తూ వైసీపీ చేస్తున్న చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ కేసులో చట్టం తన పని చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని మంత్రి సవిత స్పష్టంచేశారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. హిందువులు మహా ప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూలో పాలు తయారు చేసిన నెయ్యి లేదని, ప్రసాదం కల్తీ అయ్యిందని స్వయంగా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ స్పష్టం చేసిందన్నారు. వైసీపీ నాయకుల అవినీతితో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం బట్ట బయలవ్వడంతో వైసీపీ నాయకులు బూతులు తిడుతూ, రప్పా రప్పా నరుకుతామంటూ డైవర్షన్ రాజకీయాలకు తెర తీశారన్నారు. ఆ కుట్రలో భాగంగానే సీఎం చంద్రబాబునాయుడిని, మంత్రి నారా లోకేశ్ ను వైసీపీ నాయకులు జోగి రమేష్, అంబటి రాంబాబు దూషించారన్నారు. వైసీపీ నాయకులు ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనంతో ఉంటున్నామని, తమకు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ముఖ్యమని మంత్రి సవిత తేల్చిచెప్పారు., News News, Times Now Telugu