'కక్షపూరిత ధోరణితో కేసులా..? వెంటనే ఉపసంహరించుకోవాలి' ఏపీ ప్రభుత్వానికి హరీష్ రిక్వెస్ట్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ను అరెస్ట్ చేయాలని పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రి అమిత్ షాను కోరినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకున్నప్పటికీ కేసులు ఎత్తివేయకపోవడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుబట్టారు. ఈ కక్షపూరిత కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.