TGSRTCకి కాసుల వర్షం.. మహాలక్ష్మి పథకంతో నష్టాల నుంచి లాభాల్లోకి, రూ.1,059 కోట్ల ప్రాఫిట్

పదేళ్ల నష్టాల తర్వాత టీజీఎస్‌ఆర్‌టీసీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,059.2 కోట్ల రికార్డు స్థాయి వార్షిక లాభాలను సాధించింది. మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల బస్సు ఆక్యుపెన్సీ 67 శాతం నుంచి 98 శాతానికి పెరగడం, టోల్ సవరణలు, ప్రభుత్వ నిధులు ఇందుకు కారణాలుగా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రానున్న 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.9,639.5 కోట్ల ఆదాయం, రూ.1,118.8 కోట్ల ప్రాఫిట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి ప్రభుత్వ నివేదికలో వెల్లడించారు.