చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. కదులుతున్న విమానం తలుపు తెరిచి కిందకు దూకేసిన ప్రయాణికుడు!

విమానం సురక్షితంగా ల్యాండ్ అయి రన్‌వే మీద నెమ్మదిగా కదులుతోంది.. అందరూ తమ సీట్ బెల్టులు విప్పి దిగడానికి సిద్ధం అవుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ ప్రయాణికుడు వెంటనే వెళ్లి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిశాడు. ఆపై క్షణాల్లోనే దాని నుంచి కిందకు దూకేశాడు. అదృష్టవశాత్తు అతడితో పాటు విమానంలోని వారెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అలాగే విమానానికి కూడా ఏమీ జరగలేదు. అయితే వెంటనే స్పందించిన సిబ్బంది.. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.