తెలంగాణలో మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు.. ఒక్కో నియోజకవర్గానికి 2 వేలు, జూన్ 1న మంజూరు

తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఈ రెండో విడతలో ఏకంగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనున్నారు. జూన్ 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి పొంగులేటి ప్రకటించారు. గతంలో మంజూరై అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసస్తామని తెలిపారు. ఇక సొంత స్థలాలు ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.