మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో ఫుల్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తుండటంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులు సంభవించే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.