ఆంధ్రకశ్మీర్ లంబసింగికి సమీపంలోనున్న చిట్రాళ్లగొప్పు ఉద్యాన పంటల మార్కెట్‌లో అనాస, పనస పండ్ల విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది గిరిజన ప్రాంతం నుంచి అనాస, పనస ఎగుమతులు పెరిగాయి. దీంతో పండ్లకు గిరాకీ పెరిగింది. పనస కాయ పరిమాణం ఆధారంగా రైతులకు రూ.80-150, అనాస రూ.20-25 ధర లభిస్తోంది. ఐదేళ్ల తరువాత మార్కెట్ ప్రారంభంలోనే అనాస, పనస పండ్లకు మంచి ధర రావడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.