జైల్లో ఉన్నా పీఎం, సీఎం పదవి పోనట్లేనా? రాజ్యాంగ సవరణ బిల్లుపై జేపీసీ సంచలన సిఫార్సులు!

దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కీలకమైన మార్పులను ప్రతిపాదించింది. బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) కీలక సవరణలను సూచించింది. తీవ్ర నేరారోపణలపై అరెస్ట్ అయి, వరుసగా 30 రోజుల పాటు జుడీషియల్ కస్టడీలో ఉండే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను నేరుగా పదవి నుంచి తొలగించడం కంటే, వారి పదవులను సస్పెన్షన్‌లో ఉంచడమే సరైనదని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం.