తెలంగాణలో ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు..! క్లారిటీ..

తెలంగాణలో ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దయిందనే వార్తలపై స్పష్టత వచ్చింది. ప్రభుత్వం ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతి పంచాయతీలో ప్రత్యేక ఖాతా తెరవాలని ఆదేశించింది. ఈ నిధుల చెల్లింపులకు సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ సంతకాలు (DSC) తప్పనిసరి అని పేర్కొంది. ఈ ప్రక్రియలో ఉప సర్పంచ్ పేరు ప్రస్తావించకపోవడంతో అధికారం రద్దయిందనే ప్రచారం జరిగింది. అయితే.. వాస్తవానికి ఇది కేవలం కేంద్ర నిధుల నిర్వహణకు సంబంధించిన సాంకేతిక మార్పు మాత్రమే. గ్రామ పంచాయతీ సాధారణ నిధుల వినియోగంలో ఉప సర్పంచులకు ఉండే పాత అధికారాలు ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది.