నాడు ఫీజు కట్టిన గురువుకు.. నేడు కారు గిఫ్ట్ ఇచ్చిన శిష్యుడు: కర్ణాటకలో అందరినీ కదిలిస్తున్న గురుదక్షిణ

సమాజంలో గురువు స్థానం ఎంత ఉన్నతమైనదో, కృతజ్ఞత అనే పదానికి అసలైన అర్థం ఏమిటో చాటిచెప్పే ఒక హృదయపూర్వక సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఒకప్పుడు పేదరికంలో ఉండి, స్కూల్ ఫీజులు కట్టలేక చదువు ఆపేసే పరిస్థితిలో ఉన్న ఒక అనాథ విద్యార్థికి ఆ ఉపాధ్యాయుడే సర్వస్వమై నిలిచారు. ఫీజులు కట్టి పీజీ పూర్తయ్యే వరకు కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పించాడు. అలా ఉపాధ్యాయుడికి ఆ విద్యార్థి ఊహించని బహుమతి ఇచ్చాడు. ముఖ్యంగా ఆయన పదవీవిరమణ పొందుతున్న రోజు ఓ కారు కొనుక్కొచ్చి గురువు చేతిలో తాళాలు పెట్టాడు. ఇది చూసిన ఆ గురువు తీవ్ర భావోద్వేగం చెందిన మాటలు నెట్టిటం వైరల్ అవుతున్నాయి.