ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం.. ఇది రికార్డే

ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలో మరో చారిత్రక అంతర్జాతీయ గౌరవం చేరింది. ఇథియోపియా దేశం యొక్క అత్యున్నత పురస్కారం ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను మంగళవారం ఆయన అందుకున్నారు. భారత్-ఇథియోపియా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో.. ప్రపంచ నాయకుడిగా ఆయన దూరదృష్టికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రభుత్వాధినేత మోదీ కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.