బెంగాల్ మరో సంచలనం.. మమతా బెనర్జీ నివాసంలో సీఐడీ సోదాలు

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమితో టీఎంసీ పేక మేడలా కూలుతోంది. ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఇదే సమయంలో బెంగాల్‌ అసెంబ్లీని కుదిపేసిన సంతకాల కుంభకోణం టీఎంసీలో ప్రకంపనలు రేపుతోంది. అసెంబ్లీలో శోభన్‌దేబ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా నియమిస్తున్నట్టు రాసిన లేఖలో సంతకాలు తమవి కాదని, ఫోర్జరీ చేశారని టీఎంసీ ఎమ్మెల్యేలు ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదయ్యింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దీదీ నివాసంలో మంగళవారం సోదాలు నిర్వహించారు.