అతిథులను కాపాడలేదు.. సామగ్రి, డ్యాన్సర్‌లకే ప్రాధాన్యమిచ్చారు: గోవా అగ్నిప్రమాద బాధితుడి సంచలన కామెంట్లు

గోవాలోని నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన భావనా జోషి జీవితం విషాదమయంగా మారింది. ఈ దుర్ఘటనలో ఆమె తన భర్తతో సహా నలుగురిని కోల్పోయారు. సిబ్బంది నిర్లక్ష్యంపై సంచలన ఆరోపణలు చేసిన జోషి.. అధికారులు ప్రకటించిన నష్టపరిహారం నాకు భిక్షంలా అనిపిస్తోంది, నాకు అది వద్దు అని కన్నీటి పర్యంతమయ్యారు. నలుగురు పిల్లలు, వృద్ధుల బాధ్యత తనపై పడిన నేపథ్యంలో.. ఆ పరిహారం కంటే బతుకుదెరువు కోసం ఒక ఉద్యోగం ఇవ్వాలని జోషి అధికారులను కోరారు. మరోవైపు ప్రమాదానికి బాధ్యులైన క్లబ్ యజమానులు.. సౌరభ్, గౌరవ్ లుత్రాలు తాజాగా థాయిలాండ్‌లో అరెస్టయ్యారు.