అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్.. రూ.54 కోట్ల బంగారం స్వాధీనం.. అస్సాం పోలీసుల స్పెషల్ ఆపరేషన్

అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు చేశారు అస్సాం పోలీసులు. ఖార్‌ఘలి ప్రాంతంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు గ్రూప్స్‌గా ఏర్పడి చేసిన ఆపరేషన్‌లో రూ. 54 కోట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ బంగారం భారత్ - మయన్మార్ బోర్డర్‌లో పనిచేస్తున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు చెందిందిగా పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెబుతున్నారు.