ఇథనాల్‌పై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా.. నితిన్ గడ్కరీ సీరియస్ వార్నింగ్!

దేశంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనం (Ethanol Blended Petrol) వాడకంపై జరుగుతున్న చర్చలు, సోషల్ మీడియా ప్రచారంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా స్పందించారు. ఇథనాల్ అంశంలో ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిపై వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా తన కుమారుడు నిఖిల్ గడ్కరీ కంపెనీని లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.