కాలం మారింది.. రికార్డు మారింది! నాడు రేడియో కాలపు రాజకీయం.. నేడు రీల్స్ కాలపు పోరాటం..!

భారత ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 10 ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ప్రస్తుత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజున ఒక అరుదైన, చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకోనున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల ద్వారా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. దీంతో, దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నెలకొల్పిన సుదీర్ఘ కాలపు రికార్డును నరేంద్ర మోదీ అధిగమించనున్నారు.