ఘోర విషాదం.. ఆల్చిప్పల కోసం నదిలోకి దిగి 8 మంది మృతి

కర్ణాటకలోని ఉత్తర కన్నడలో విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగి 8 మంది చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. ఆల్చిప్పల కోసం తట్టేహక్కులు నదిలోకి దిగిన వీరు.. నీటి ప్రవాహం పెరగటంతో కొట్టుకుపోయారు. మొత్తం 14 మంది నదిలోకి దిగగా.. ముగ్గుర్ని జాలర్లు కాపాడారు. 11 మంది గల్లంతు కాగా.. ఆదివారం సాయంత్రానికి 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.