చేయూత పెన్షన్ల పంపిణీ విధానం మార్పు.. ఐఏఎస్ అధికారుల తరహాలోనే పంచాయతీ సిబ్బందికీ, సీఎం కీలక నిర్ణయం

తెలంగాణలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నెలకు రూ.50 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. పంచాయతీరాజ్ చట్టం, 2018కి సవరణలు చేయడం ద్వారా పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీకి బదులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే చేయూత పెన్షన్ల పంపిణీని పోస్టల్ విధానం నుండి నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి మార్చాలని అర్హుల నిర్ధారణకు ఆధార్, ఓటర్ ఐడీ డేటాను ఉపయోగించాలని సీఎం స్పష్టం చేశారు.