తమిళనాడు రాజకీయాల్లో సంచలనం: బీజేపీ వీడిన అన్నామలైకు ఊహించని మద్దతు... 24 గంటల్లో 14 లక్షల మంది నమోదు

తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం అన్నామలై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అన్నామలై రాజీనామా అనంతరం తమిళనాడు బీజేపీలో కుదుపు నెలకొంది.బీజేపీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా మరో సంచలనం సృష్టించారు అన్నామలై. బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం అన్నామలై తమిళనాడు ప్రజలను ఆకట్టుకునేలా కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజల సెంటిమెంట్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. భాష, ప్రాంతీయ రాజకీయం, సనాతన ధర్మం వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు ప్రజలను మరింత ఆకట్టుకున్నాయి. తన రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించిన నిమిషాల వ్యవధిలోనే అన్నామలై తన సొంత రాజకీయ ఉద్యమాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త ఉద్యమంకు శ్రీకారం చుట్టబోతున్నట్లు చెప్పుకొచ్చారు. అన్నామలై పిలుపునకు తమిళనాడులోని యువత, అభిమానులు, ప్రముఖ నేతల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది.అన్నామలై ఢిల్లీ నుంచి తమిళనాడు చేరుకోగానే ఘన స్వాగతం లభించింది. మరోవైపు అన్నామలై కొత్త ఉద్యమం ప్రకటించిన 24 గంటలలోపే దాదాపు 14 లక్షల మంది కొత్త మూవ్‌మెంట్‌లో డిజిటల్‌గా సైన్ అప్ చేసి మద్దతు తెలపడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది., News News, Times Now Telugu