దేశంలో లక్షలో 18 మందికి క్యాన్సర్... కర్నూలులో స్టేట్ కాన్సర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తాం: సీఎం చంద్రబాబు నా

రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కాన్సర్ నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్ సహా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కాన్సర్ సోకకుండా 15 ఏళ్ల లోపు బాలికలంతా విధిగా హెచ్ పీవీ టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావి వలసలో హెచ్ పీవీ వ్యాక్సినేషన్ , పేదల సేవల కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రజా వేదిక సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆడబిడ్డలు సర్వై కల్, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా రక్షించేందుకు దేశ వ్యాప్తంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్లే ప్రపంచవ్యాప్తంగా 74 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో ఇవి 63 శాతం ఉండగా మన రాష్ట్రంలో 68 శాతంగా ఉన్నాయి. ఏపీలో క్యాన్సర్ కేసులు 2021లో 29,379 నుంచి 2025కి 32,657కు పెరిగాయి. క్యాన్సర్ కేసుల్లో సుమారు 65 శాతం మహిళల్లో నమోదవుతున్నాయి. బ్రెస్ట్, సర్వై కల్ వంటి క్యాన్సర్లు మహిళల్లో అధికంగా ఉంటే, పురుషుల్లో నోటి క్యాన్సర్ ఎక్కువుగా వస్తోంది. సర్వైకల్ క్యాన్సర్ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారింది. ప్రతీ లక్ష మంది మహిళల్లో 15 నుంచి 20 మంది సర్వై కల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ వ్యాక్సిన్ కు రూ.4 వేలు ఖర్చవుతుంది. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 3.45 లక్షల బాలికల వ్యాక్సినేషన్ కోసం రూ.14.11 కోట్లు వ్యయం చేస్తున్నాం. రాష్ట్రంలో 15 ఏళ్ల లోపు వయసున్న బాలికలు 3,45,377 ఉండగా, విజయనగరం జిల్లాలో 11,989 బాలికలున్నారు. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రంలో 1,645 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేసి 16,912 సిబ్బందిని నియమించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు., News News, Times Now Telugu