ఆడబిడ్డ నిధి పథకంపై ఏపీ మంత్రి కీలక ప్రకటన: ఈ పథకం కింద 18 ఏళ్లు దాటిన మహిళకు ఏడాదికి రూ.18వేలు... అర్హతలు, ప

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇలా ఏడాదికాలంగా జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ ఆడబిడ్డ నిధి పథకం అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఈ ఆడబిడ్డ నిధి పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉంది అని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆదిశగా అడుగులు వేస్తోందని చెప్పుకొచ్చారు.గతంలో వృద్ధాప్య పింఛన్లను రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచిన విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గుర్తు చేశారు. ఈ ఆడబిడ్డ నిధి పథకంపై ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.ఇకపోతే ఈ ఆడబిడ్డ నిధి పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు ₹1500 అందించనుంది. ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం‘ఆడబిడ్డ నిధి’పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే ఒక్కో మహిళ ఏడాదికి రూ.18వేలు అందుకోనుంది అని తెలుస్తోంది. ఈ పథకానికి 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళ అర్హురాలే. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో నెలకు ₹1500 నగదు ప్రభుత్వం ప్రత్యక్షంగా జమ చేయనుంది., News News, Times Now Telugu