బిడ్డా మమ్మల్ని క్షమించు...నీకు న్యాయం చేయలేకపోయాం: అయేషా మీరా తండ్రి ఇక్బాల్ కన్నీరుమున్నీరు

‘మా కుమార్తె హత్య జరిగి 18 ఏళ్లు అయ్యింది. మాకు న్యాయం చేయండి అని పోరాటం చేస్తున్నాం. కానీ ఇప్పటికీ మా పోరాటానికి న్యాయం జరగలేదు’అని అయేషా మీరా తండ్రి ఇక్బాల్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఖబరిస్తాన్‌లో అయేషా మీరా తుది అంత్యక్రియలు జరిగాయి. ముస్లింమత ఆచారాల ప్రకారం ఆయేషా అవశేషాలను కుటుంబ సభ్యులు, మతపెద్దలు ఖననం చేశారు. అయేషా మీరా అవశేషాల ఖననం అనంతరం ఇక్బాల్ మీడియా వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ అయేషా మీరా కేసు ఇక్కడితో ముగిసింది అని అంటున్నారని... అసలు న్యాయం జరగకుండా కేసు ఎలా ముగుస్తుంది? అని ఇక్బాల్ ప్రశ్నించారు. మా కుమార్తె విషయంలో సీబీఐ, సిట్ అన్యాయం చేశాయి అని ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశారు., News News, Times Now Telugu