ఏపీలో ఇళ్లు లేని నిరుపేదలకు గుడ్‌న్యూస్...10 లక్షలకు పైగా గృహప్రవేశాలు లక్ష్యం: సీఎం చంద్రబాబు నాయుడు

ప్రతి పేదవానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే సుమారు 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు పట్టామని... మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల ఇళ్లకు పైగా గృహ ప్రవేశాలు చేయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇళ్లు లేని పేదలు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో హౌసింగ్, వ్యవసాయ శాఖ పద్దులపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆయా శాఖల్లో ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... “గత పాలకులు గృహ నిర్మాణం రంగంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక విధానాన్ని కూడా అస్తవ్యస్తం చేసి అవినీతికి పాల్పడ్డారు. ఈ అక్రమాల్లో భాగస్వాములైన వారిని చట్టపరంగా శిక్షిస్తాం. రాష్ట్రంలో 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవు. వారందరికీ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తాం. అందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలను ముమ్మరంగా చేపడుతున్నాం. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను రాయచోటి నుంచి ప్రారంభించాం. ఈ ఏడాది ఉగాదిలోగా దాదాపు 3 లక్షల ఇళ్లల్లో గృహప్రవేశాలు చేయిస్తాం. జూన్‌కు 2.26 లక్షలు, సెప్టెంబరులో 2.10 లక్షల ఇళ్లకు కూడా గృహప్రవేశాలు జరిగేలా లక్ష్యం నిర్దేశించుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాయి. గత పాలకులు చేసిన తప్పును సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే దీనిపై కార్యాచరణ చేపడతాం. 2029లోగా పేదలందరికీ ఇళ్లు కట్టించటంతో పాటు ఉచితంగా ఇంటి స్థలాలు కూడా ఇస్తాం” అని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు., News News, Times Now Telugu