రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం... రాక్షసుల్లా వైసీపీ నాయకులు అడ్డుపడకండి: మంత్రి అచ్చెన్నాయుడు

‘జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగిపోతే కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం వైసీపీ సభ్యులు చేస్తున్నారు. 2020లోనే ఎన్జీటీ క్లియర్‌గా రిపోర్ట్ లో చెప్పింది. మేమే ఆపింది, ఆ ఘనత మాదే అని మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా ప్రకటించాడు. ఇంకా ఎందుకు వైసీపీ సభ్యులు ఈ డొంకతిరుగుడు వాదనలు చేస్తున్నారు?’అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ‘రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను ఐదేళ్ల పాటు నిర్వీర్యం చేసి... ప్రాజెక్టులు కొట్టుకుపోయిన ప్రజల మరణానికి కారణమైన జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి. ఐదేళ్ల పాలనలో రాయలసీమకు చేసింది శూన్యం. రూ.12 లక్షల కోట్ల బడ్జెట్ లో రాయలసీమకు ఖర్చు చేసింది 1 శాతం కూడా లేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తో పాటు రాయలసీమ లిఫ్ట్ కు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు సరైన సమాధానం ఇచ్చారు. అయినా వైసీపీ సభ్యులు సభను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించారు’ అని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు., News News, Times Now Telugu