విజయవాడ ఉ్రగమూలాల కేసులో సంచలనం: మహిళలను జిహాదీలుగా మార్చేందుకు ఖవాతీన్ గ్రూప్...ఇన్‌చార్జిగా హైదరాబాద్ యువతి,

విజయవాడలో ఇటీవలే ఉగ్రమూలాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే.ఈ కేసును మరింత లోతుగా విచారణ జరపగా దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఉగ్రవాదులు యువత (మగవారు)నే టార్గెట్ చేసుకునేవారు. వారిని రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు మళ్లించుకునేందుకు వ్యూహాలు రచించేవారు. అయితే ఈసారి ఉగ్రవాదులు రూట్ మార్చారు. తాజాగా ఆడవాళ్లను కూడా తమ కార్యకలాపాలకు వినియోగించుకునేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో జిహాదీ కార్యకలాపాలలో మహిళలను భాగస్వాములను చేసేందుకు విదేశీ హ్యాండ్లర్లు మహిళలతో కలిసి ‘ఖవాతీన్’అనే గ్రూపును ఏర్పాటు చేశారు.సోషల్ మీడియా వేదికగా మహిళలను ఈ ఖవాతీన్ గ్రూపులోకి ఆకర్షించేవారు. ఈ ఖవాతీన్ గ్రూపును ఇటీవలే హైదరాబాద్‌లో పోలీసులకు చిక్కిన సైదా బేగం పర్యవేక్షించేవారని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ నిర్ధారించింది., News News, Times Now Telugu