ఏపీలో ఎస్సీల్లోకి మరో కులం.. ప్రయోజనాలను వర్తింపజేయాలని చంద్రబాబు ఆదేశాలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని బుడగజంగాలకు ఎస్సీ ప్రయోజనాలు వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. బుడగ జంగాలను ఎస్సీలలో చేర్చే అంశం గురించి తాను కేంద్రంతో మాట్లాడుతానన్న చంద్రబాబు.. అప్పటి వరకూ ఉద్యోగాలలో మినహా ఎస్సీలకు వర్తించే మిగతా అన్ని ప్రయోజనాలను వారికి వర్తింపజేయాలని కలెక్టర్లను ఆదేశించారు.