ఖైరతాబాద్ ఉప ఎన్నిక తప్పదా? ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏమిటి?

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి మరోసారి ఎన్నికలు వస్తే ఖచ్చితంగా గెలుస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని...కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రిని ఏక వచనంతో సంబోధించడం సరికాదు అని దానం నాగేందర్ సూచించారు. సీఎం పదవికి గౌరవం ఇవ్వాలి. విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాలి అని కౌంటర్ ఇచ్చారు. కార్యకర్తల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని...తనకు కార్యకర్తలే లం అని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. కార్యకర్తల అండతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని...ఉప ఎన్నిక వస్తే కూడా మరోసారి గెలుస్తానని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు., News News, Times Now Telugu