అక్రమ కేసులకు వైసీపీ భయపడదు...కూటమి నాయకులు భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదు: మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి

‘కూటమి ప్రభుత్వ పాలన రోజురోజుకీ మరింత దిగజారుతుంది. చంద్రబాబు ప్రభుత్వం పిన్నెలి సోదరులను అక్రమ కేసులో అన్యాయంగా జైలుకు పంపారు. పిన్నెలి సోదరులను ఆధారం లేని కేసులో ఇరికించి, చంద్రబాబు ఆనందం పొందుతున్నాడు’అని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.‘వైఎస్ జగన్ రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్‌ని నమ్మిన వ్యక్తులపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి...చంద్రబాబు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు’అని కాకాణి గోవర్థన్ రెడ్డి ధ్వజమెత్తారు.‘కూటమిపాలనలో ఫ్లెక్సీలు కట్టినా, సోషల్ మీడియా పోస్టింగ్‌లు పెట్టినా కేసులు పెడుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కేసులు సృష్టించి మరీ జైళ్లకు పంపుతున్నాడు’అని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.‘కూటమి నాయకులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. పిన్నెల్లి సోదరులు న్యాయస్థానాలపై నమ్మకం ఉంచి, ధైర్యంగా న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పిన్నెల్లి సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది’అని మాజీమంత్రి కాకాణి గోవర్థ్ రెడ్డి పేర్కొన్నారు., News News, Times Now Telugu