తెలంగాణకు భారీ వర్ష సూచన.. జులై 4 వరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో వాతావరణ శాఖ జులై 4వ తేదీ వరకు పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 8న ఆలస్యంగా ప్రవేశించి, ఆ తర్వాత నెమ్మదించిన రుతుపవనాలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా భరంపూర్‌లో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది. రానున్న రోజుల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సహా ఉత్తర, తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.