తెలంగాణకు రూ.9,968 కోట్లు.. గ్రామ పంచాయతీలకు నిధుల పండగ

తెలంగాణకు కేంద్రం తీపి కబురు అందించింది. 16వ ఆర్థిక సంఘం ఐదేళ్ల కాలానికి (2026-31) రాష్ట్రానికి రూ.9,968 కోట్ల గ్రాంట్లను కేటాయించింది. గ్రామీణ జనాభా, వైశాల్యం ప్రాతిపదికన ఈ నిధుల కేటాయింపు జరిగింది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లలో మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ప్రజాసేవలకే వీటిని ఉపయోగించాలని వేతనాలు, పెన్షన్లకు వాడరాదని కేంద్రం స్పష్టం చేసింది. నిధుల బదిలీ, వినియోగంలో పారదర్శకత కోసం ఆడిట్ నివేదికలు, ఇ-గ్రామ్‌స్వరాజ్‌ పోర్టల్‌ నమోదును తప్పనిసరి చేస్తూ కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది.