తీవ్ర శోకాన్ని మిగిల్చిన అతి వేగం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో శుక్రవారం (జూన్ 26) తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాచర్ల పట్టణ సమీపంలోని నగరవనం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని, వేగంగా దూసుకొచ్చిన తుఫాను వాహనం వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.