నల్లమల సాగర్ పై తెలంగాణ అభ్యంతరాలు ఎందుకు?... ఫ్యాక్షన్ మనస్తత్వంతోనే హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు: సీఎం చంద్రబాబు నాయుడు

కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమం- అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన ప్రజలకు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో వాగ్దానాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంతో పాటు...అభివృద్ధి బాట పట్టించామని వెల్లడించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా అసెంబ్లీలో శుక్రవారం చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గత ప్రభుత్వ పాలన వల్ల కలిగిన ఇబ్బందులను ఎలా అధిగమించింది వెల్లడించారు. నాటి ప్రభుత్వం చేసిన దురాగతాలను ఎండగట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమాన్ని అడ్డుకునేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని సీఎం చంద్రబాబు శాసన సభలో అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పని చేశాయి. గత ప్రభుత్వ హయాంలో పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు కన్నీళ్లు పెట్టుకున్నాను. 2019-24 మధ్య నాలాగే చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. విశాఖ వెళ్తే పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారు. గతంలో అరాచకాలు చేసిన వాళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ప్రజలు ప్రతీ అంశాన్నీ గమనిస్తూనే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. దాని ఫలితమే కూటమి అద్భుత విజయం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు., News News, Times Now Telugu