అంతర్జాతీయ ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం...సాగరమాల ద్వారా హార్బర్ల ఆధునీకరణ:మంత్రి అచ్చెన్నాయుడు

‘PMMSY(ప్ర‌ధానమంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న‌), సాగరమాల వంటి కేంద్ర పథకాల సహకారంతో రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నామని వ్యవసాయ,మ‌త్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెందుర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పరవాడ మండలంలోని ముత్యాలమ్మపాలెం గ్రామంలో మినీ జెట్టి / ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కోస్తా ప్రాంత అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల స్థితిగతులు, ముత్యాలమ్మపాలెం ప్రాజెక్ట్ పురోగతి గురించి స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. దీనికి సమాధానంగా వ్యవసాయ,మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి 12 కోస్తా జిల్లాల్లో కలిపి 1053.07 కి.మీ తీరప్రాంతం ఉండగా, 350 ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు గుర్తించబడ్డాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టామని, 2020 సంవ‌త్స‌రం జులై 15 నుంచి ఫిషింగ్ హార్బర్లు మత్స్యశాఖ నుంచి పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. తొలి దశలో జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్లు నిర్మాణంలో ఉండగా, రెండో దశలో బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవు హార్బర్లు ప్రతిపాదనలో ఉన్నాయని వ్యవసాయ,మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు., News News, Times Now Telugu