పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.. రోజుల వ్యవధిలో..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని నదులలో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. రాజమండ్రి పర్యటనలో పవన్ కళ్యాణ్ గోదావరి నది కలుషితమవడాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నదులలో కాలుష్య నివారణ కోసం అంతర్ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే బుధవారం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ అటవీ శాఖ నుంచి జీవో జారీ అయ్యింది. గోదావరితో పాటుగా ప్రధాన నదులలో కాలుష్య నివారణ కోసం ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేయనుంది.