బెంగళూరులో కాంగ్రెస్ ర్యాలీ వల్ల భారీ ట్రాఫిక్ జామ్.. నీట్ పరీక్ష రాయలేకపోయిన ముగ్గురు అభ్యర్థులు!

దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పునః పరీక్ష... బెంగళూరులో రాజకీయ రచ్చకు కారణమైంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నగర నడిబొడ్డున నిర్వహించిన భారీ రాజకీయ ర్యాలీ కారణంగా కిలో మీటర్ల మేర రహదారులు స్తంభించిపోయాయి. దీంతో పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోలేక మెడికల్ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు రోడ్లపైనే గంటల తరబడి నరకయాతన అనుభవించారు. చివరకు నిమిషాల వ్యవధిలో పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వెళ్లి పరీక్ష రాయలేకపోయారు. దీంతో విద్యార్థులు సహా వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ.. కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.