మీనాక్షి నాటరాజన్ నామినేషన్‌ తిరస్కరణకు కారణం ఇదే.. తెలంగాణతో లింకు ఉన్న ఆ కేసు ఏంటంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ కోర్టు జారీ చేసిన సమన్ల వివరాలను అఫిడవిట్‌లో దాచారనే బీజేపీ ఫిర్యాదుతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. నారాయణపేట కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్‌రెడ్డిపై ఉన్న లైంగిక వేధింపుల కేసులో పార్టీ పరంగా చర్యలు తీసుకోలేదంటూ బాధితురాలు కోర్టులో రూ.10 కోట్ల నష్టపరిహార పిటిషన్ వేశారు. ఈ కేసులోనే మీనాక్షి నటరాజన్‌కు సమన్లు వచ్చాయి. కాగా.. బీజేపీ ఓటమి భయంతోనే కుట్ర చేసిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ వెల్లడించారు.